Nikhat Zareen: నా కల నెరవేరింది.. పోలీస్ యూనిఫాం ధరించడం గౌరవంగా ఉంది
- యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్
- పాల్గొన్న డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్
- తెలంగాణ పోలీస్ యూనిఫాం ధరించడం గౌరవంగా ఉంది.. నా కల నెరవేరింది
- ఇప్పటి వరకు బాక్సర్ నిఖత్ అని పిలిచే వారు.. ఇప్పుడు డీఎస్పీ నిఖత్ అని పిలుస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే… అయితే.. ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.
Read Also: Delhi Weather : ఢిల్లీలో పొగమంచు కారణంగా చాలా విమానాలు రద్దు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ యూనిఫాం ధరించడం గౌరవంగా ఉంది.. తన కల నెరవేరిందని అన్నారు. ఇప్పటి వరకు బాక్సర్ నిఖత్ అని పిలిచే వారు.. కానీ ఇప్పుడు డీఎస్పీ నిఖత్ అని కూడా పిలుస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ట్రైనింగ్ పొందుతున్న కానిస్టేబుల్స్‌కి బాక్సింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వాలని డీజీపీ కోరారని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి కూడా ఒలింపియన్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ను తయారు చేయొచ్చని నిఖత్ జరీన్ తెలిపారు.
Read Also: Live-in Relationship: గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోకపోయినా దానికి ఓకే చెప్పిన హైకోర్టు
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇద్దరు ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు మన టీజీఎస్పీ (TGSP)లో చేరారని అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని తెలిపారు. వీళ్ళను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా.. బాక్సింగ్, క్రికెట్ పై కూడా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయం అని డీజీపీ జితేందర్ చెప్పారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!