రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: K.A. Paul: కేటీఆర్‌పై కేసు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. ఒక్క చీర ఇచ్చి వందల సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది అని ఆరోపించారు. రైతులకు 21 వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారు.. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వం పై 24 వేల కోట్లు భారం పడిందని అన్నారు. మరోవైపు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలపై బురద జల్లుతున్నరన్నారు. మహిళలు తలుచుకుంటే ఇంటినే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం ఏలగలరని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..