మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. నాలుగు నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు వచ్చాయంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది.
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ గంటకు పైగా కొనసాగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్‌ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్‌కు వివరించారు.
దేశంలో టాటా కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ పై నమ్మకం ఎలా ఉంటుందో వేరే చెప్పక్లర్లేదు. టాటా దేశ ప్రజలకు ఓ నమ్మకమైన బ్రాండ్. టాటా ఉత్పత్తులు వాడని విలేజ్ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది వాహనాలైనా, ఇతర ప్రొడక్ట్స్ అయినా కచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఇక వెహికల్స్ విషయానికి వస్తే టాటా కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుది. ప్రస్తుతం వాహనదారులంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించే పనిలో పడింది. త్వరలోనే టాటా నానో ఈవీని…
ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆదివాసీ సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని నియమించింది.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.
సంక్రాంతి పండగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని అన్నారు. మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.