అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6 వేల చొప్పున ఏడాదికి 12 వేలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Read Also: MLC Jeevan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదు..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ క్రమంలో ఈ సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారు.
Read Also: Mrunal – Dulquer : మరోసారి జతకట్టనున్న సీతారామం జంట.. ఈ సారి వేరే లెవల్