వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు... అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్) విధానంపై దృష్టి పెట్టాలని తెలిపారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయింపు చేసింది ప్రభుత్వం.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నిర్వాహకులు.. ఒకపక్క పోలీసుల అంచులు కొనసాగుతున్న నిర్వాహకులు పందెంబరులను అందంగా ముస్తాబు చేసే పనిలో పడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్న బకాయిలు బిల్లులు రూ.6,700 కోట్లకు పైగా ఉన్న వాటిని చెల్లించడానికి ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖపై ప్రత్యేక సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక చేసింది. జనవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి షమీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. టీ20 జట్టు నుంచి రిషబ్ పంత్‌ను తప్పించారు. అలాగే... ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.
విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు.
సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు.