తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం రేపుతుంది. టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది.. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్ ను పూడిమాడకకు తెచ్చి వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని అన్నారు.
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరాయి. ప్రతీసారి ఉన్నట్లే భారీ వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది.
చలికాలంలో పలు రకాల వ్యాధుల భారిన పడుతుంటారు. పుదీనా టీ తీసుకుంటే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. వింటర్ లో పుదీనా టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీన టీ తాగితే మరింత హెల్తీగా ఉంటారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
సచివాలయంలో ఈరోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26వ తేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించామన్నారు. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ.. రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన మీదటే.. ఈ పథకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.