ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్‌ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్‌కు వివరించారు. కాగా.. అడిగిన ప్రశ్నలు పదేపదే అడిగారని కేటీఆర్ తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్ చెప్పారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈనెల 16న విచారణకు హాజరు కావాలంటూ తెలిపింది.
Read Also: Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష
ఇదిలా ఉంటే.. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 6 గంటలపాటు బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో.. IAS అధికారి అరవింద్ కుమార్ ఆదేశాలతో నగదు రిలీజ్ చేసామని బిఎల్ఎన్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశానని అన్నారు. ఇందులో తనకు సొంత ప్రయోజనం ఏమీ లేదని వెల్లడించారు. ఒకవైపు మంత్రి మరోవైపు పై అధికారి ఒత్తిడి వల్లనే ప్రొసీడింగ్స్ చేశానని బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. తాను ఏసీబీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మీరు అడిగిన ప్రశ్నలే ఈడీ కూడా అడిగింది.. ఈడీ అడిగిన ప్రశ్నలు అన్నిటికి తాను సమాధానం ఇచ్చానని బిఎల్ఎన్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..