చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఏఐ ఫీచర్లు, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో రూపొందించిన ఈ న్యూ ప్యాడ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మరి షావోమీ ప్యాడ్ 7 ధర ఎంత? ఫీచర్లు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: Donald Trump: “పుతిన్ నన్ను కలవాలనుకుంటున్నారు”.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
షావోమీ ప్యాడ్ 7 ఫీచర్ల విషయానికి వస్తే.. 11.2 అంగుళాల LCD డిస్ల్పేతో వస్తుంది. 3.2K రిజల్యూషన్ తో వస్తుంది. ప్యాడ్ కు బ్యాక్ సైడ్ 13MP, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అందించారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 7+ జన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఏఐ రైటింగ్, సబ్ టైటిల్స్, ఏఐ క్రియేషన్ వంటి ఏఐ ఫీచర్లు ఈ ప్యాడ్ లో అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా కలిగి ఉంది. ఈ కొత్త ప్యాడ్ లో 8,850 mAh బ్యాటరీని అందించారు. 45w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Read Also: Ponnam Prabhakar: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు వార్నింగ్.. అలా చేస్తే బస్సులు సీజ్
ధర విషయానికి వస్తే.. 8GB+128GB వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. 12GB+256GB వేరియంట్ ధర రూ. 30999గా కంపెనీ నిర్ణయించింది. ఇక నానో టెక్చర్ డిస్ల్పేతో తీసుకొచ్చిన 12GB+256GB వేరియంట్ ధర రూ. 32999గా నిర్ణయించారు. షావోమీ ప్యాడ్ 7 జనవరి 13 నుంచి అమెజాన్, షావోమీ రిటైల్ స్టోర్లతో పాటు వెబ్ పోర్టల్ లో సేల్ ప్రారంభంకానున్నది. అడ్వాన్డ్స్ ఫీచర్లు కలిగిన టాబ్లెట్ కావాలనుకునే వారు షావోమీ ప్యాడ్ 7పై ఓ లుక్కేయండి.