మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. నాలుగు నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు వచ్చాయంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి ఈ హామీ ఇచ్చారు. మూడు నెల క్రితం రెవిన్యూ విభాగం అధికారులు పలువురికి నోటీసులు ఇవ్వడంతో మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వాటన్నింటిని తొలగించుకోవాలని లేదంటే కూల్చి వేస్తామని గతంలో రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో.. అన్ని వివరాలు సేకరించి నాలుగు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్.. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్థానిక కాలనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. మణికొండ జాగీరులో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్‌లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే.. అక్రమ నిర్మాణాలను స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. వెంటనే స్పందించి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేశారు.
Read Also: CM Revanth Reddy: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు..