సంక్రాంతి పండగకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హైదరాబాద్ సహా.. ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, 16 నుంచి 20వ తేదీన వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపుతుంది. అయితే.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. రోజు వారీగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని ఆర్టీసీ తెలిపింది.
Read Also: CM Revanth Reddy: కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం..
సంక్రాంతి పండగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని అన్నారు. మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పండగ సమయంలో ప్రయాణికుల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామన్నారు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా.. రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. పండగ పూట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చారు.
Read Also: INDIA alliance: ఇండియా కూటమి విచ్ఛిన్నం, కాంగ్రెస్‌దే బాధ్యత.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..