సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు.
తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు.
ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఒంటిమిట్టలో అన్నప్రసాద సముదాయ నిర్మాణం కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు.
కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో పథకాలిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు.
మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.
ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.