Botsa Satyanarayana: విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు. లక్షా75వేల486 ఉపాధ్యాయుల్లో 52 వేల 240 మంది బదిలీల పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 98.23 శాతం మంది రిలీవ్ అయి కొత్త స్థానాల్లో చేరి పోయారని మంత్రి బొత్స అన్నారు. సుమారుగా వెయ్యి మంది ప్రత్యామ్నాయం లేక బదిలీ కాలేకపోయారని.. 679 మందిని సెకెండ్ ఎమ్‌ఈవో పోస్టుల్లో నియమించామని బొత్స తెలిపారు.వారి స్థానాల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్‌లుగా ప్రమోషన్ ఇచ్చామని.. ఇంకా 355 ఎమ్ఈవో 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని మంత్రి బొత్స అన్నారు.
Read Also: విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి బొత్స సమావేశం..!
మరోవైపు ఎండ తీవ్రత నేపథ్యంలో మరో వారం రోజులు బడులను ఒంటి పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేకాకుండా పది వేల స్కూళ్ళల్లో స్మార్ట్ టీవీలు పెట్టామన్నారు. వాటిని ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి పరిస్థితులు పరిశీలించాలని పేర్కొన్నారు. సూచనలు, సలహాలు ఇస్తే అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 9 వేల స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ ఉన్నారని.. ప్రతి మండలంలో 3-5 టీచర్లను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. సింగిల్ స్కూళ్ళకు అవసరాన్ని బట్టి వీళ్ళు బోధిస్తారని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Read Also: Greece Boat Tragedy: గ్రీస్ పడవ ప్రమాదంలో 12 మందిని అరెస్టు చేసిన పాకిస్తాన్
రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇప్పటికే 78 శాతం పంపిణీ చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. మరో వారం రోజుల్లో వంద శాతం పంపిణీ పూర్తి అవుతుందని సూచించారు. అంతేకాకుండా రేపు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో 87 మంది విద్యార్థులకు రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరుగనుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు.