Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు […]
ఈ రోజుల్లో ప్రింటర్ అవసరం ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా ఉంటుంది. మీరు కొత్త ప్రింటర్ కొనడానికి వెళితే, మార్కెట్లో చాలా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సరైన ప్రింటర్ ను ఎంచుకొని తీసుకోవాలి. అయితే కొత్త ప్రింటర్ కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ప్రింటర్ కొనుగోలు కోసం సరిపడా బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి.
వైటాలిటీ బ్లాస్ట్ లో సోమర్‌సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్ వేసేటప్పుడు అతని వేలికి గాయమైంది. బాలు వేసిన వెంటనే అతనివైపు రావడంతో.. దాన్ని ఆపే క్రమంలో బంతి అతని వేలికి తాకుతుంది. వెంటనే మెర్వ్ నొప్పితో గంతులేస్తాడు. అంతేకాకుండా అతని వేలు మెలితిరిగి పోయింది. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి వేలు లాగుతాడు. అయినప్పటికీ.. మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.
Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా […]
భారత ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్‌గా భవానీ చరిత్రకెక్కింది. చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది.
టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నకిరేకల్ మండలం కేతపల్లిలో లంచ్ విరామ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.
యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు రూట్.
ఢిల్లీలోని వికాస్ పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.