BJP MP GVL: ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో పథకాలిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. గడప గడపకు కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారన్నారు. ఏపీ రాజధాని ఏదంటే అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగునే సీఎం జగన్ చెబుతారని విమర్శించారు. రాజధాని ఏదంటే..? లేదు.. తెలియదు.. చెప్పలేం అనే డైలాగే వైసీపీ నేతల నుంచి వస్తుందని తెలిపారు. పరిపాలన చేతకాకుంటే సీఎం జగన్ రాజీనామా చేయాలని జీవీఎల్ దుయ్యబట్టారు.
Read Also: Chinmayi: సింగర్ చిన్మయి పిల్లలను చూశారా .. ఎంత ముద్దుగా ఉన్నారో
మరోవైపు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కు అమిత్ షా సహకరిస్తున్నారని అచ్చెన్న ఏదేదో మాట్లాడారని.. కానీ బీజేపీ ఏపీ ప్రజలకు మాత్రమే సహకరిస్తుందని ఆయన అన్నారు. అమిత్ షాని జగన్ రాత్రుళ్లే కలుస్తున్నారన్న అచ్చెన్న.. చంద్రబాబు అమిత్ షాను ఎప్పుడు కలిసారో గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు. బీజేపీతో అవసరం ఉంటే ఓ రకంగా.. అవసరం లేకుంటే మరో రకంగా మాట్లాడ్డం సరికాదన్నారు. ఏపీలో బీజేపీపై టీడీపీ రాజకీయాలు మానుకోవాలని చెప్పారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి బీజేపీనే కారణమని టీడీపీ అంటోందని.. వాళ్లని పట్టుకోవడం మా పనా అని విష్ణువర్థన్ ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ గో బ్యాక్ అని నినాదాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు సీబీఐ, ఈడీ కమ్ బ్యాక్ అంటోందని ఎద్దేవా చేశారు.
Read Also: Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు
మరోవైపు ఏపీ రాజధాని ఏదో వైసీపీ నేతలు చెప్పగలరా అంటూ విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ గాల్లో తిరుగుతున్నారు.. రోడ్ల మీద తిరిగితే ఏపీ అభివృద్ధేంటో తెలుస్తుందని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలివ్వలేకపోతోందని విమర్శించారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పన్నుల భారమేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తోందని.. ఇళ్ల పట్టాల కోసం చేసిన భూ సేకరణలో అధికార పార్టీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.