Summer Effect: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇంట్లో నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. జూన్ చివరలో కూడా ఇలా ఎండలు ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాష్ర్టంలోని ఉమ్మడి జిల్లాలో నిప్పుల కొలిమి రాజుకుంటుంది. రోజు 40కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని సింగరేణి ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. సాయంత్రంఆరు గంటల వరకు కూడా ఎండ తీవ్ర ప్రతాపం చూపుతోంది. దీంతో చల్లదనం కోసం కూలర్లు, ఏసీలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎండ తీవ్రత దృష్ట్యా కొబ్బరి బొండాలు, శీతలపానీయాలను తీసుకుంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతూ జనాన్ని చమటలు పట్టిస్తోంది.
Read Also: Adipurush: ప్రమోషన్స్ చేయకుండానే బాలీవుడ్ దుమ్మురేపుతున్న ‘ఆది పురుష్’.. అరచాకం అంటే ఇదే!
అంతేకాకుండా ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టివ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి, వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవీతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. ఎండల ప్రభావంతో.. మే 19 నుంచి అత్యవరసం అయితే తప్పా ఆపరేషన్లు చేయడం లేదని తెలుపగా.. జూన్ 19 వ తేదీ వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలు చేయడం లేదని రిమ్స్ డైరెక్టర్ చెప్పారు.