Virendra Sachdeva: ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న బీజేపీ.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ రోడ్లపై తిరిగే ట్యాక్సీలు, బస్సుల్లో ప్యానిక్ బటన్‌ల ఏర్పాటు పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోట్లాది కుంభకోణానికి పాల్పడుతోందని వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపించారు.
Read Also: Delhi University: ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో ఓ విద్యార్థి హత్య.. కారణమదేనా..!
మరోవైపు ఢిల్లీలోని పబ్లిక్ వాహనాల్లో అమర్చిన ప్యానిక్ బటన్‌లు పనిచేయడం లేదని చూపించేందుకు వీరేంద్ర సచ్‌దేవా ఆదివారం ఢిల్లీ రోడ్లపై ట్యాక్సీలో ప్రయాణించారు. రోడ్డుపై ఉన్న వాహనంలో పానిక్ బటన్ నొక్కినా ఎవరూ రాలేదన్నారు. మొత్తం వ్యవస్థలోనే ఎంత పెద్ద మోసం చేశారని సచ్ దేవ్ తెలిపారు. ప్యానిక్ బటన్ పేరుతో ఒక్కో వాహనం నుంచి 9 వేల రూపాయలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆ రుసుమును 17 వేలకు పెంచారని తెలిపారు. ఇది పానిక్ బటన్ కానప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్ చేశారు.
Read Also: Rakesh Master: నేను చనిపోతానని ముందే తెలుసు.. కన్నీరు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి మాటలు
బటన్ పనిచేయని వాహనాల నుంచి ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజు కూడా తీసుకుంటున్నారని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఫీజు పేరుతో 4800 రూపాయలు తీసుకుంటున్నారని, ఈ డబ్బు ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎన్ని పానిక్ బటన్లు నొక్కారో చూడాలని కేజ్రీవాల్‌కు వీరేంద్ర సచ్‌దేవా సవాల్ విసిరారు. వారికి సహాయం ఎక్కడ చేరింది? మరి దాని కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండంటూ ప్రశ్నించారు.