Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. అందులో భాగంగా.. పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాజకీయ నాయకులు యువతను ఓట్లు కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. సమాజానికి తన వంతు సాయం చేయాలని జనసేన పార్టీ పెట్టడం జరిగిందని పవన్ కల్యాణ్ పేర్కొ్న్నారు. అంతేకాకుండా కాకినాడ తనకు ఎప్పుడు అండగా నిలబడిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తలచుకుంటే ఏపీకి మార్గ దర్శం చేయవచ్చు అన్నారు. అంతేకాకుండా తమ పెద్దనాన్న ఇక్కడే పోస్ట్ మాస్టర్ గా పని చేశారని పవన్ తెలిపారు.
Read Also: Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు
మరోవైపు పవన్ మాట్లాడుతూ.. కౌన్ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. కౌన్ కిస్కా గాళ్లను కౌన్ కిస్కా అనే అంటామన్నారు. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏమి చేయాలి.. సీఎం దోపిడిదారుడు అయితే ఏమి చేయాలని పవన్ అన్నారు. 2009 నుంచే రాజకీయాల్లో ఉంటే వైసీపీని రానివ్వకుండా చేసేవాన్నని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి.. పవన్ కళ్యాణ్ ఏమి చేయలేడు అనే ఉద్దేశ్యంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాడని.. దిగజారుడు బూతులు, పిచ్చి పిచ్చిగా తిట్టాడని పవన్ అన్నారు.
Read Also: BJP MP GVL: సీఎం జగన్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్.. కేంద్ర నిధులతోనే నవరత్నాలు ఇస్తున్నారని ఆరోపణ..!
ఎమ్మెల్యే బియ్యం ఎగుమతి చేస్తాడు, దొంగ నోట్లు ముద్రించాడు అని మా వాళ్ళు చెప్పారని పవన్ అన్నారు. అప్పట్లో ఉండే ఎస్పీ నాయక్ వాళ్ల కుటుంబ సభ్యులను బేడీలు వేసి నడిపించాడని తెలిసిందన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన చేస్తే జనసేన కార్యకర్తలపై రాళ్ళ దాడి చేశారన్నారు. ఈ క్రిమినల్ కి బుద్ధి చెప్పాలని అప్పుడే అనుకున్నట్లు పవన్ కల్యాన్ తెలిపారు. ఎమ్మెల్యేకి నోటి దూల ఎక్కువ అయింది, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉందని.. తనకు వచ్చిన కోపానికి డికాయట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండే వాడు కాదన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Kavya Kalyanram: బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్
వైసీపీ నేతలు, సీఎం మీద తనకేమీ కోపం లేదని పవన్ తెలిపారు. కానీ రౌడీ యిజం, దోపిడీ, కబ్జాలు చేస్తే కచ్చితంగా బాధ్యత గల వారు ఎదురు తిరుగుతారని పవన్ అన్నారు. ఈ వ్యక్తి కుల దూషణతో తమ వాళ్ళను టార్గెట్ చేశారని.. జుట్టు పట్టుకుని, ముట్టుకోని చోట ముట్టుకొని భూతులు తిట్టాడని జనసేనాని అన్నారు. చంద్ర శేఖర్ రెడ్డి తాగి ఒళ్ళు పొగరు ఎక్కి డబ్బులు ఎక్కువ అయ్యి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని దుయ్యబట్టారు. కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించాడని.. రౌడీగాడు తిడతా ఉంటే ఏమి చేయాలో అర్థం కాలేదని పవన్ తెలిపారు. ఇంకోసారి కుల దూషణ చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.