Hyderabad: జవహర్ నగర్ బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఘటనలో తెలంగాణ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఛైర్ పర్సన్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి, కమిషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి శారద బాధితురాలిని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
Yashika Aannand : టెంప్టింగ్ లుక్స్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ..
Also Read
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
ఈ సందర్భంగా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సఖి ప్రతినిధులను ఆదేశించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, రాష్ట్ర మహిళా కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ధైర్యం కల్పించారు. నిందితుడి అరెస్టు విషయంలో తక్షణమే పోలీస్ స్పందించారని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.
Hyderabad: ఇంత కక్కుర్తి ఏందిరా.. నవ్వు తెప్పిస్తున్న విచిత్ర దొంగతనం..!
రాష్ట్రంలో మహిళలందరికీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లి స్థానంలో ఉండి ఒక మహిళే ఘోరాన్ని ఆపకుండా నిందితుడికి సహకరించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో పరిసర ప్రాంత ప్రజలు ప్రేక్షకపాత్ర వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, స్థానికులు తక్షణమే స్పందించి ఉంటే యువతికి రక్షణ కల్పించినవారయ్యే వారని సునీతాలక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?