జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివర్ బోయ్ అవతారమెత్తాడు. తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. […]
పుంగనూరు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిడ్డి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు.
పుంగనూరులో పోలీసులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. నల్ల రిబ్బన్లతో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
ఘజియాబాద్‌లో ఓ టెంపోలో అమ్ముతున్న టమాటాలను విక్రయించడానికి చాలా మంది జనాలు బారులు తీరారు. మహాగుణ్ పురం సొసైటీలో చాలా మంది నివాసితులు క్యూలో నిలబడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది.
గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సనా ఖాన్.. సినిమా ప్రపంచానికి వీడ్కోలు పలికింది. గతంలో బిగ్ బాస్ స్టార్ గా ఎదిగిన సనాకు.. చాలా మంది అభిమానులు ఉన్నారు. మరోవైపు గత జూలైలో తనకు పాప పుట్టిందన్న వార్తను సనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్, సనాలను అభినందించేందుకు పలువురు వేదికపైకి వచ్చారు. ప్రస్తుతం సనా పాపకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రపంచ […]