ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల వద్ద నుండి లేదా ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేవని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144 సిఆర్.పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Hyper Aadi : హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలే ఆయనకి ఫ్యాన్స్..
మరోవైపు మహాధర్నాకు వచ్చే ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా అన్నారు. దీంతో నగరంలోని అన్ని లాడ్జ్ లను మరియు హోటల్స్ లలో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ముందస్తుగా నేతల రాకపోకలపై పోలీసులు నిఘా పెట్టగా.. బెజవాడ వచ్చే మార్గాలపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విద్యుత్ సౌద, పరిసర ప్రాంతాలలో, నగరంలోని ముఖ్య ప్రదేశాలలో ఫేస్ రికగ్నైజింగ్ సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహాధర్నాకు ఎవరైనా తలపించిననట్లైతే.. హౌస్ అరెస్టులతో పాటు బైండో వర్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.