తొలి టీ20లో పోరాడి ఓడిన టీమిండియా.. రెండో టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు ఇప్పటికే 1-0తో విండీస్ జట్టు ముందంజలో ఉంది.
Minibus Accident: అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి
అయితే తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలువాలనే పట్టుదలతో ఉంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. జూనియర్లతో టీ20లు ఆడిస్తుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో టీమిండియాలో ఒక మార్పు చేశారు. నెట్ ప్రాక్టీసులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి గాయం కావడంతో, అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక.. వెస్టిండీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
Minibus Accident: అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి
ఓపెనర్స్ గా టీమిండియా తరుఫున ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ కు దిగారు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లు ముగిసేసరికి 9 పరుగులు ఉంది. ఇషాన్ కిషన్(8), గిల్(1) పరుగులు చేశారు.