TS Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. టీఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఉద్యోగులు విలీనంతో ప్రభుత్వానికి ఏటా 3 వేల కోట్ల భారం పడుతుందన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు.
Bholaa Shankar Pre Release LIVE : ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలతో పాటు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విధాలుగా సభ క్రమశిక్షణతో నడిచిందని స్పీకర్ పేర్కొన్నారు. ఎనిమిది సెషన్లలో సజావుగా సాగేందుకు, పద్దులపై చర్చించేందుకు, ప్రశ్నలకు జవాబులు ఇప్పించేందుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!