రాష్ట్రాన్ని రక్షించండి – దేశాన్ని కాపాడండి పేరుతో.. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ ఐస్సుయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఇక్కడున్నా, విశాఖలో ఉన్నా.. గుండు సున్నానే అని ఆరోపించారు. సీఎం జగన్ ఎవరితో మాట్లాడరని.. ఎవరినీ కలవరని రామకృష్ణ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం జగన్.. పరిపాలనను గాలికి వదిలేశాడని రామకృష్ణ అన్నారు. జగన్ కు అభివృద్ధిపై దృష్టిలేదని.. అలాంటప్పుడు విశాఖలో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, లేక సముద్రంలోని ఓడలో ఉన్నా ఒరిగేది, పోయేది, వచ్చేది ఏమి ఉండదని విమర్శలు చేశారాయన.
Gaddar Passes Away LIVE UPDATES: మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు
సీపీఐ చేపట్టే ఈ బస్సుయాత్రలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కేంద్ర నాయకులు బినయ్ విశ్వం, అమరజిత్ కౌర్, కె.నారాయణ పాల్గొంటారని రామకృష్ణ తెలిపారు. ఈ యాత్ర ఉద్దేశ్యమేంటంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, తిరోగమన విధానాలపై ప్రజలను చైతన్యం చేయటానికి ఈ యాత్ర అన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్ని రకాల అప్పులపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని జరపాలని ఆయన కోరారు. మరోవైపు అమర్ రాజా కంపెనీ బస్సుపై, ఉద్యోగులపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.