15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (ఆగస్టు 22) సాయంత్రం 5.15 గంటలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆహ్వానం మేరకు ప్రధానికి అక్కడికి వెళ్లారు.
క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది.
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
బంగ్లాదేశ్కు చెందినమహిళ ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నానని.. తనను మూడేళ్ల క్రితం ఢాకాలో వివాహం చేసుకున్నట్లు మహిళ పేర్కొంది. తన భర్త నోయిడాలో నివసిస్తున్నట్లు.. ఇప్పుడు తనను విడిచిపెట్టాడని మహిళ పోలీసులకు చెప్పింది.
జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 లైవ్ చూడటానికి పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. చంద్రయాన్ విజయవంతమైతే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'చంద్రయాన్-3' ద్వారా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ లైవ్ ను చూసేందుకు పాఠశాలలు సాయంత్రం ఒక గంట పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచాలన్నారు.
పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి.. ఎంత ఘోరానికి తెగించాడంటే ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పరీక్షలు రాస్తుండగా.. సరిగా రాయలేకపోవడంతో ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టాడు ఓ విద్యార్థి.
మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ కుల గణనను నిర్వహిస్తామనిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.