ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘చంద్రయాన్-3’ ద్వారా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ లైవ్ ను చూసేందుకు పాఠశాలలు సాయంత్రం ఒక గంట పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సూచనలను ఉటంకిస్తూ.. “ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటలకు, చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ ప్రక్రియ ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ మరియు డిడి నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సర్కార్ ఆదేశించింది.
Read Also: Raashi Khanna : హాట్ క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన రాశీ ఖన్నా..
మరోవైపు రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ హుల్గి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చారిత్రాత్మక సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సాయంత్రం వేళల్లో పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి’’ అని అన్నారు. చంద్రయాన్-3 చంద్రుని ల్యాండింగ్ ఒక ముఖ్యమైన సందర్భమని, ఇది యువతలో ఉత్సుకతను పెంచడమే కాకుండా అన్వేషణ పట్ల మక్కువను రేకెత్తిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా విద్యా మరియు శిక్షణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.
Read Also: Jupalli Krishna Rao: మీరు.. తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు..
రష్యా యొక్క లూనా -25 మిషన్ విఫలమైన తరువాత.. ఇప్పుడు అందరి దృష్టి భారత్ యొక్క చంద్రయాన్ -3 పైనే ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జూలై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించింది. చంద్రయాన్-3 నిర్మించండానికి రూ. 250 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో.