విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం పట్టుదల, కష్టపడి చదివితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ రేపు అనగా.. ఈరోజు నుంచి చదివితే ఏం లాభం. చదువుపై మంచిపట్టు ఉంటేనే పరీక్షల్లో పాస్ కావచ్చు. పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి.. ఎంత ఘోరానికి తెగించాడంటే ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పరీక్షలు రాస్తుండగా.. సరిగా రాయలేకపోవడంతో ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టాడు ఓ విద్యార్థి. అందులో రూ.100, రూ.200, రూ.500 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా వెల్లడించారు.
Komati Reddy Venkat Reddy: ఒక్కసారి తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించండి..
అయితే ఈ విషయంపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మంచిగా చదివి మెరుగైన మార్కులు సంపాదించుకునే ఆలోచన ఉండాలి కానీ.. ఇలా లంచంతో పాస్ అయిపోదామనుకున్నవా అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడే ఇలా లంచం ఇస్తున్నావంటే.. ఒకవేళ పరీక్షల్లో పాసై మంచి ఉద్యోగం సంపాదిస్తే అక్కడ లంచంగా ఎన్ని డబ్బులు లాగుతావంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కాలంలో విద్యార్థుల్లో కొంతమంది జల్సాలకు అలవాటుపడి తీరా పరీక్షల సమయం వచ్చేసరికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని నెటిజన్లు తెలుపుతున్నారు.
Kottu Satyanarayana: పవన్ కల్యాణ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.. అది స్పష్టం..!
ఓ టీచర్ కరెన్సీ నోట్లను గుర్తించిన విషయాన్ని ఐపీఎస్ అధికారి బోత్రాతో పంచుకోగా, ఆయన దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ‘‘ఈ ఫొటోని ఓ టీచర్ పంపించారు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలన్న అభ్యర్థన అక్కడ రాసి ఉంది. మన విద్యార్థులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ గురించి ఇది తెలియజేస్తోంది’’ అని అరుణ్ బోత్రా తన స్పందన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ చూసిన కొందరు టీచర్లు.. ఇలాంటి అనుభవాలు తమకూ ఎదురయ్యాయంటూ చెబుతున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా సినిమా కథలు, విషాదగాథలు, డబ్బులు ఉంచడాలు చేస్తున్నారని.. దానివల్ల టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తున్నారని పేర్కొన్నారు.