జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 లైవ్ చూడటానికి పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకు తగ్గట్టు.. చంద్రయాన్ విజయవంతమైతే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ.. కొందరు విద్యార్థులు ఇస్రోకు శుభాకాంక్షలు తెలుపుతూ అనేక సందేశాలు పంపారని ఏజెన్సీ తెలిపింది.
Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
మరోవైపు యూపీ సీఎం స్కూళ్లలో విద్యార్థుల కోసం లైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. “చంద్రయాన్-3 ల్యాండింగ్ ఒక చిరస్మరణీయ అవకాశం, ఇది ఉత్సుకతను ప్రోత్సహించడమే కాకుండా, విచారణ పట్ల మన యువతలో అభిరుచిని కలిగిస్తుంది” అని అన్ని పాఠశాలలను ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించింది. అటు గుజరాత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ 2,000 మంది పాఠశాల విద్యార్థులను “చారిత్రక ఘట్టాన్ని” పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు ఏర్పాట్లు చేశారని హెడ్ నరోత్తమ్ సాహూ తెలిపారు. అంతేకాకుండా.. గుజరాత్‌లోని 33 జిల్లాల కమ్యూనిటీ సైన్స్ సెంటర్‌లలో చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
New Pics Of Moon By Chandrayaan 3: జాబిల్లి ఫోటోలు తీసిన చంద్రయాన్ 3… షేర్ చేసిన ఇస్రో
కోల్‌కతాలోని రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మిషన్‌ను జరుపుకోవడానికి “సైన్స్ పార్టీ”ని ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారంతో “ఉల్లాసకరమైన విద్యా సాహసాన్ని ప్రారంభించమని” ప్రజలను కోరుతోంది. మరోవైపు చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ముంబై, వారణాసిలో మంగళవారం ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక బెంగళూరులో ఓ రెస్టారెంట్ లో చంద్రయాన్ ల్యాండింగ్ కోసం “అగ్నిర్వా” అనే అంతరిక్ష ఔత్సాహికుల బృందానికి శ్రీకాంత్ చుండూరి అనే వ్యక్తి “వాచ్ పార్టీ”ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
MLA Rajaiah: టికెట్ రాకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందే ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య
చంద్రయాన్-3 విజయవంతమైతే భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది. అంతేకాకుండా.. ఇస్రో కీర్తి మరింత పెరగనుంది. ఆగస్టు 20వ తేదీన రెండవ, చివరి డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువైంది. 40 రోజుల చంద్రయాన్- 3 ప్రయాణంలో ఎన్నో దశల్ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. అంతా అనుకున్నట్టుగా సాగితే రేపు సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్‌తో ఇస్రో తనదైన ముద్ర వేయనుంది.