సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు ప్రపంచ రెజ్లింగ్ అపెక్స్ బాడీ UWW రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని గురువారం సస్పెండ్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో ఎన్నో వింత వింత జీవులు, జంతువులు చూస్తుంటాం. అందులో ఇదొక రకమైన వింత జీవి. దాన్ని చూస్తేనే గగుర్పాటు కలిగిలే ఉంది. ఇంతకీ అది ఏమంటారా.. అదొక సముద్ర జీవి. దాని మెడ చుట్టూ పదునైన దంతాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మొత్తం అక్కడ 100 మంది బాలికలు ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.
ఘజియాబాద్‌లో ఓ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఆ బస్సు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్దిగా గుర్తించారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులను దించిన కొద్ది నిమిషాలకే బస్సులో మంటలు చెలరేగాయి.
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు.
బెంగళూరులో ఓ వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను పట్టుకుని నగరం మొత్తం కలియతిరిగాడు. అంతేకాకుండా.. GPSని ఉపయోగిస్తూ ఇండియా మ్యాప్‌ను వెతుకుతూ నగరం అంతటా నడిచాడు. తాను నడుస్తు్న్న వీడియోను ట్విట్టర్(X) లో వికాస్ రూపరేలియా పోస్ట్ చేశారు.
మైనర్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను మంగళవారం కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా రాణిని కూడా ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్‌ను కొట్టి తీసుకెళ్లారు.