7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి గుండెలోని మృదు కణజాలంలో గాయం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 24) నాటి తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో అతను కార్గిల్‌లోని సైనిక సిబ్బందితో కలిసి కనిపించాడు. అంతేకాకుండా.. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులను కాంగ్రెస్ ఎంపీ ప్రశంసించారు.
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టోర్నీకి ముందు బెంగళూరులో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటలు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే.. 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 వారాల విరామంలో ఉన్న రోహిత్-కోహ్లీతో సహా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రోగ్రామ్ చార్ట్‌ను సిద్ధం చేసింది.
ఉత్కంఠభరిత పోరులో నంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ విజయం సాధించాడు. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా కార్ల్ సన్ అవతరించాడు. ఫైనల్లో భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
చంద్రయాన్-3 విజయవంతంపై యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. భారత్ చరిత్రను సృష్టిస్తూనే ఉందని X (ట్విట్టర్) లో తెలిపారు.
ఈరోజు చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని.. ఇస్రో శాస్త్రవేత్తల జీతం అభివృద్ధి చెందిన దేశాల కంటే ఐదు రెట్లు తక్కువగా ఉన్నందున ఈ ఘనత సాధించామని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ పేర్కొన్నారు.
కులులో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.