రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇటీవలే.. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని కన్వెన్షన్ సెంటర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నాయకులు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో జీ20 సమావేశాలు నిర్వహించే తేదీలను ప్రకటించారు.
Read Also: Tips To Escape From drowning Car: మీరు ఉన్న కారు మునిగిపోయిందా? ఇలా తప్పించుకోండి
జీ20 సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా ప్రధాని జీ జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సహా పలువురు దేశాధినేతలు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం పరిమితి మరియు మళ్లింపు ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాన రహదారులపై మాక్ డ్రిల్ నిర్వహించారు. మరోవైపు జీ20 సమావేశంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. పోలీసులు తమ సిబ్బందికి రసాయన, జీవ ఆయుధాలు నిర్వహించేలా శిక్షణ ఇస్తూ వారి సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన 19 మంది పోలీసులు “మార్క్స్ ఉమెన్”, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) విభాగానికి చెందిన మహిళా కమాండోలు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) మధ్యప్రదేశ్‌లోని దాని శిక్షణా కేంద్రంలో నాలుగు వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
Read Also: Tummala Nageswara Rao: పాలేరు నుంచి తుమ్మల పోటీ చేయాల్సిందే..
ప్రపంచ ఆర్థిక సమస్యలు, సహకారం, విధాన సమన్వయంపై చర్చించడానికి దేశాధినేతలు, ఆర్థిక నిపుణులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను కలిసి G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అందుకోసం ప్రపంచం దృష్టి మొత్తం ఢిల్లీ వైపు మళ్లనుంది.