ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్ బద్దలు కొట్టాడు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్ఆర్ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవా డేస్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానము అందించారు.
దుబాయ్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్లో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యం కివీస్ స్టార్ ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకుంది. వేలంపాటలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఈ క్రమంలో చివరకు చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్‌ను 14 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 1 కోటి, అయితే అతను 14 రెట్లు…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ బస్ సౌకర్యం వలన ఆటో కార్మికులకు…
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
2023 సంవత్సరం వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త సంవత్సరం 2024కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే.. క్రికెట్ అభిమానులు కూడా ఈ సంవత్సరంలోని జ్ఞాపకాలు, మధురక్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం ఓ చెత్త జ్ఞాపకం. అంతేకాకుండా.. ఈ సంవత్సరం చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అందులో చాలా మంది ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత మాత్రమే…
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఉన్న తన్విత ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారుచేసి విక్రయించి, ప్రతి నెల లక్షకు 8 వేల రూపాయల కమిషన్ ఇస్తామని తెలిపారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది కోసం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం.. మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద పలు రాయితీలకై రూ. 375 కోట్ల…