2024 జనవరిలో శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడటం కోసం ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని చూస్తోంది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక రైలులో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. అందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో.. త్వరలో…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సచివాలయంలో క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. విద్య, వైద్య రంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని..…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని తమ లక్ష్యమన్నారు. బడ్జెట్లను కొలమానంగా తీసుకున్నాం.. రెవెన్యూ ఎక్స్ పెండెచర్ విషయంలో కాగ్ ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. లోన్ల విషయంలో ఆర్బీఐని పరిగణలోకి తీసుకున్నాం.. ఉద్యోగుల అంశంలో కాగ్ ని పరిగణలోకి తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి…
భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ భూమి 209 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలు చేపట్టారని రెవెన్యూ,మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ వద్ద గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా సంబంధిత భవన ధ్రువపత్రాలు చూపని ఎడల కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
2023 సంవత్సరానికి గానూ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం 'ఖేల్ రత్న'కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు. ఇక.. 26 మందికి అర్జున అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. అందులో క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. ఈ జాబితాలో పారా ఆర్చర్ శీతల్ దేవి పేరు కూడా ఉంది. అంతేకాకుండా.. ఏపీకి చెందిన టీమిండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్…
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలుకల బాధకి ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆదాయం ఎలా సమకూర్చుతారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులకు, జీతాలకు 70 శాతం ఆదాయం పోతే.. మిగతా 30 శాతం నిధులతో గత సంక్షేమ పథకాలతో పాటు కొత్తవి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల పాలైంది అని చెబితే కొత్త అప్పులు ఎలా పుడుతాయని మహేశ్వర్ రెడ్డి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అంటున్నారు.. ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి ఆయకట్టు సున్నా.. కొత్త ఆయకట్టు లేకుండా,…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో రభస నెలకొంది. నిన్ను కేసీఆర్, కేటీఆర్ వాడుకుని వదిలేస్తారు అని మాజీ మంత్రి హరీష్ రావును రాజగోపాల్ అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మొన్న జరిగిన సభలో హరీష్ రావు... రాజగోపాల్ రెడ్డిని నీకు మంత్రి పదవి రాదు అని అన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎంత కష్టపడ్డ…
ఈరోజు (బుధవారం) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రవీంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు కార్యాలయం నుండి వెళ్తుండగా కొందరు డాక్టర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను హత్తుకుని డైరెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఉద్యోగులు, సిబ్బంది ఏడ్చారు. కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా పని చేశారు అంటూ శ్రీనివాసరావుతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. ఆయన గుర్తుగా డాక్టర్ శ్రీనివాసరావుతో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు, డాక్టర్లు…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు.. తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.