Cheating: తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఉన్న తన్విత ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారుచేసి విక్రయించి, ప్రతి నెల లక్షకు 8 వేల రూపాయల కమిషన్ ఇస్తామని తెలిపారు.
Read Also: Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం
ఆ విధంగా ఆల్విన్ కాలనీలో నివసించే భీమయ్య నుండి 25 లక్షల రూపాయలు, అతనికి పరిచయం ఉన్న వారి నుండి మొత్తం 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మొదట తక్కువ పెట్టుబడి పెట్టిన సమయంలో కొన్ని నెలలు కమిషన్ చెల్లించిన పెద్దమొత్తంలో పెట్టుబడి రాగానే కమిషన్ చెల్లించటం నిలిపివేశారు. తమకు కమిషన్ కానీ తాము చెల్లించిన అసలును చెల్లించాలని బాధితులు కోరగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
Read Also: Karnataka School: దారుణం.. విద్యార్థులతో సెప్టెక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్