తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు అప్పజెప్పింది. ఇంఛార్జీలుగా నియమించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులే ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ఉన్నారు. Read Also: Ap Jobs 2023 […]
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్ లో పేలుడు పదార్థాలు సల్ఫర్, పొటాషియం…
హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి అని పేర్కొన్నారు.
గాంధీభవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకోసం పని చేసిన అందరికి అందాల్సిందేనని తెలిపారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీ ఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలని అన్నారు. మన కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దామని రేవంత్ రెడ్డి నేతలకు చెప్పారు. గ్రామ సభలలోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారితనంతో పనిచేస్తుందన్నారు. వ్యక్తుల కోసం కాదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్కు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో.. నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. కాగా.. రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది…
బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు గల కారణాలు తెలియకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డండ పీఎస్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే విడుదల చేయాలని…