హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్న భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. అయితే భక్తులు మధ్యాహ్నమే కొచ్చికి బయలుదేరాల్సి ఉండగా.. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ఇంకా వెళ్లలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి 64 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఇదే విషయమై ఎయిర్ పోర్టు అధికారులను అడిగితే.. ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాగా.. తాము వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్లు అన్ని మిస్ అయ్యాయని అయ్యప్ప…
మేడారం జాతరపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొ్న్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని మంత్రి అన్నారు. మేడారం జాతర కోసం అడగ్గానే నిధులు కేటాయించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని…
బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (డిఎంసిహెచ్) వైద్యుల మందు పార్టీ చేసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైద్యుల మద్యం పార్టీ చేసుకుంటున్న సమాచారంతో.. SSP అవకాష్ కుమార్ ఆదేశాల మేరకు సదరు SDPO అమిత్ కుమార్ నేతృత్వంలో శనివారం సాయంత్రం DMCH అతిథి గృహంలో దాడి చేశారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. వైరల్ అవుతున్న వీడియోపై…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18(రేపు) రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన మనసు చెబుతోందని కేజ్రీవాల్ అన్నారు. అనంతరం..…
రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించానున్నారు. మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభినందన సభ పై చర్చ జరుగనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.