Mitchell Starc: ఐపీఎల్ చరిత్రలో రికార్డు.. అత్యధిక ధర పలికిన స్టార్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్ బద్దలు కొట్టాడు.
Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు.. సామాన్యుల జేబులకు చిల్లే..
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. గత 8 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ఆడలేదు. అయితే.. 2023 వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఫైనల్ లో జట్టు విజయం కోసం కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. స్టార్క్ మునుపు ఉన్న ఫామ్ కంటే, ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నారు. ఈ క్రమంలో అతను ఈ ఐపీఎల్ లో.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో అతని పేరు రాగానే.. స్టార్క్ ను సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పెద్ద మొత్తంలో వేలం వేసింది. ఆ తర్వాత ఆ ఫ్రాంఛైజీలు తప్పుకోవడంతో.. కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ వేలంలోకి వచ్చాయి. ఈ రెండు ఫ్రాంఛైజీల మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. చివరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
NRI Invitation: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు..
ఇదిలా ఉంటే.. పాట్ కమిన్స్ రూ. 20.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టి, మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లు చెల్లించి తమ జట్టులోకి చేర్చుకుంది. మిచెల్ స్టార్క్ తన చివరి ఐపీఎల్ 2015లో ఆడాడు. ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ స్వింగ్ బౌలర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. అతను 20.38 సగటుతో మరియు 7.17 ఎకానమీ రేటుతో మొత్తం 34 వికెట్లు తీశాడు. అయితే.. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మిచెల్ స్టార్క్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి మరీ…
- Tags
- Auction
- Highest Price
- ipl
- kkr
- record
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు