ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బాలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ. 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు చెన్నై…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాకుండా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చుపుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలన్నీ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీలో నిర్వహించిన 'ఇండియా కూటమి' సమావేశం ముగిసింది. ఈ నెల 22 న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో అధికార పార్టీ వ్యవహారానికి నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సమావేశంలో భారత కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చించారు. మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానిగా పోటీ చేస్తారా అనే అంశంపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ సమయంలో మమతా బెనర్జీ మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలని ప్రతిపాదించారు. దీనికి ఆప్ నేత…
రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్‌పై ప్రతిపక్షాలు, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తాం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.…
హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి 3 జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి మున్సిపల్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తున్న బిల్డర్‌లకు ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది.. దానికి అగుగుణంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసింది బంగారు తెలంగాణ అయితే.. ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కాగా.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు, యూనియన్లు నిరసన చేస్తున్నారు.. వారికి అండగా ఉంటాం.. వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 15 రోజుల్లో రివ్యూ చేస్తామని మంత్రి చెప్పారు. ఆరు గ్యారంటీ స్కీమ్…