జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ బస్ సౌకర్యం వలన ఆటో కార్మికులకు కొంత ఇబ్బంది కలుగుతుంది.. సీఎం వారి కోసం తీవ్రంగా ఆలోచన చేస్తున్నారని చెప్పారు.
Read Also: Short Nap Break: జపాన్ పద్దతి మంచిదే.. ఆఫీసులో పడుకోనివ్వండి..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరి తీయాలని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడర్లు డిజైన్ చేస్తే ఇట్లనే ఉంటదని విమర్శలు గుప్పించారు. సీఎం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మిల్లర్లు కటింగ్ పేరుతో రైతులను దోచుకున్నారని తెలిపారు. ధర్మకాంట రశీదు ఇచ్చి తరుగు తాలు లేకుండా చేయాలని అన్నారు. అంతేకాకుండా.. ఇసుక మాఫియా అరికట్టాలని కలెక్టర్ కి లేఖ ఇచ్చామని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాగా.. 28న గ్రామ సభల్ని ఏర్పాటు చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు అందజేస్తామని ఆయన తెలిపారు.
Read Also: Nizamabad: సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..