అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు.. ఆస్తి అంతకన్నా కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు, శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కల్యాణం తరువాత అక్షింతలను పంచడం ఆనవాయితీ కాగా.. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ…
రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి సీనియర్ ఖండిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 ఏళ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్ గాంధీ…
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్‌ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలేమిటని అడిగారు. కాంపిటీటివ్ బిడ్డింగ్…
మొయినాబాద్ యువతి మర్డర్ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. సీఐ రాంబాబుకు మెమో జారీ చేశారు. యువతి మిస్సింగ్ మీద బాధితులు ఫిర్యాదు చేయటానికి రాగా.. ఎస్సై శివ నిర్లక్ష్యం వహించాడు. దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. బాకరం గ్రామ పరిధిలో సోమవారం రోజు మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతిని మల్లేపల్లికి…
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే.. ఎమ్మెల్సీ కవిత పై…
తెలంగాణ రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝులిపించేందుకు రవాణా శాఖ సిద్దమవుతుంది. విజయవాడ, వైజాగ్, బెంగుళూరు రూట్స్ లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తెలిసింది.. అందుకే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టామని జాయింట్ ట్రాన్ పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. అందులో 79 బస్సుల పైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిల్లో రూ.35 వేల జరిమానా కూడా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి.. మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు.
సచివాలయంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ నెల చివరిన లేదా వచ్చే నెలలో గ్యారెంటీ అమలు నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ…
“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.