మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడింది.
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోండగా.. సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో అఫ్గానిస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ కంటే.. శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు స్పిన్ బౌలర్లలో రవి బిష్ణోయ్,…
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా సమాచారం కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని…
మరో 6 నెలల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌కు భారత కెప్టెన్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీ20లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఈ క్రమంలో.. కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా పెరిగిన పొట్ట తగ్గాలంటే ఈ పానీయాలు…
వెస్టిండీస్, యూస్ఏలలో జరగబోయే ICC టీ20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కోరాడు. ఈ పిచ్ ల్లో మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని.. కాబట్టి వీరి జోడి మంచిగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో చూసినట్లుగా పవర్‌ప్లే ఓవర్లలో కోహ్లీ మరింత స్వేచ్ఛగా స్కోర్ చేస్తాడని చెప్పాడు.…
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్‌లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సూసైడ్ నోట్‌ను స్వాధీనం…
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్-లైన్,…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని.. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని.. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?. డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది?. ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? అనే దానిపై చర్చించారు.