హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సిటీ పోలీస్ స్టాల్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయిన్ సీపీ విశ్వ ప్రసాద్, డీసీపీ సెంట్రల్ జోన్, డీసీపీ ట్రాఫిక్, ఎగ్జిబిషన్స్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, షీ టీమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. స్కూల్, కాలేజ్ పిల్లలు, నగర వాసులకు ట్రాఫిక్…
తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు అసలు సినిమా ఉంటది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసింది. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో…
జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం మరోసారి స్పష్టమైందని దుయ్యబట్టారు. రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు అయోధ్యకు రాకపోవడం.. రాజకీయ…
ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. నారాయణన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. ఎయిర్‌లైన్ పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ, "2 గంటలు ఆలస్యంగా వచ్చిందని, @IndiGo6E ఫ్లైట్ 5047లో సీట్లు లేవు! సేవ…
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు. చనిపోయిన యువతి ఎవరో తేల్చే లేకపోతున్నారు పోలీసులు. కాగా.. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తేనే హంతకుల్ని పట్టుకునే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. యువతి వయసు 20 సంవత్సరాల లోపు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది. కాగా.. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు…
కరీంనగర్లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ముూడు రోజులుగా తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో చేపట్టిన సోదాలు ముగిశాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ , కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లకు సంబందించిన కీలక పత్రాలు సీజ్ చేశారు. అంతేకాకుండా.. ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. కాగా.. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రమేష్ చారి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.