భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు.. గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి తెలిపారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవ్వరూ విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో నిరంతరం ఉద్యోగస్తులు పని చేస్తుండేవారు. అదే విధంగా.. పై సెక్షన్ లో సుమారు 100 మంది చదువుకునే యువకులు ఉండేవారు. ప్రధానంగా యువకులు, మహిళలు ఈ గదిలో ఉండి పత్రికలు చదివేవారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అయితే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్‌గ్రెన్ చలితో వణుకుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్విరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు ఎల్విరా చుట్టూ మంచు పర్వతం ఉన్నట్లు చూడవచ్చు. ఎల్విరా తన తడి జుట్టును వెనక్కి నెట్టడానికి ప్రయత్నించగా.. అది…
అఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 17.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో శివం దూబే అర్ధసెంచరీతో చెలరేగాడు. 60 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో…
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (పీఎస్‌ఐఎల్-24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. అంతేకాకుండా.. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పోర్టల్ ప్రక్షాళనపై కమిటీ చర్చించారు. ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ తెలిపింది. సీసీఎల్ఎ కార్యాలయం వేదికగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని అన్నారు. ఆన్ లైన్ లో చాలా భూములు ఎక్కలేదని.. సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని తెలిపారు.
ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు…
భారత్-అఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా.. అటు యశస్వి జైస్వాల్‌కు విరామం ఇచ్చినట్లు భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు.