జనవరి 22న అయోధ్యలో జరగనున్న ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము అన్ని మతాలతోనూ ఉన్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హిందూ మతానికి సంబంధించిన అత్యంత ప్రముఖులు (శంకరాచార్య) కూడా ఇది రాజకీయ కార్యక్రమం అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అందువల్ల.. ప్రధానమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చుట్టూ రూపొందించబడిన ఇలాంటి కార్యక్రమానికి వెళ్లడం తమకు చాలా కష్టమని తెలిపారు. అయితే దర్శనానికి…
గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్‌బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా.. ఈ బాహుబలి బత్తీ తయారు చేయటానికి…
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ.. జయ రామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. అనంతరం.. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ.
టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 15.4 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (68), శివం దూబే (63) అజేయంగా నిలిచి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు. లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మంచి ప్రదర్శనను చూపించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో.. టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన 11వ భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇండియా తరపున 52 టీ20 మ్యాచ్‌లు ఆడి 49 వికెట్లు సంపాదించాడు. అంతేకాకుండా..…
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా దీక్షకు ముందు అమెరికాలో కార్ల ర్యాలీ చేపట్టారు. న్యూజెర్సీ నగరంలో హిందూ సమాజానికి చెందిన ప్రజలు 350 వాహనాల కాన్వాయ్‌లో శ్రీరాముడి చిత్రంతో కూడిన జెండాలను పట్టుకుని తిరిగారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవానికి ముందు హిందూ మతానికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు, వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా.. విశ్వ హిందూ పరిషత్ (VHP), US చాప్టర్, అమెరికాలోని హిందువుల సహకారంతో.. ఆలయ పవిత్రతపై 10 రాష్ట్రాల్లో 40కి పైగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. VHP…
శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. అంతేకాకుండా.. దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడటం కోసం వాడే వారి పడవలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర జాఫ్నా ద్వీపంలోని కరైనగర్ తీరంలో శనివారం మత్స్యకారులను అరెస్టు చేసి, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ మత్స్యకారులను కంకేసంతురై ఓడరేవుకు తరలించారు.
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' జాతీయ స్ఫూర్తిని పొంగల్ ప్రతిబింబిస్తోందని.. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమంలోనూ అదే భావోద్వేగ అనుబంధం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోందని.. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు.
వైకల్యం అనేది ఎవరి జీవితంలోనైనా శాపం లాంటిది. అంగవైకల్యం కారణంగా నిత్యజీవితానికి సంబంధించిన పనులు సక్రమంగా చేయలేకపోతారు. చాలా మంది కాళ్లతో వైకల్యంతో ఉంటారు. మరికొందరు చేతులతో వైకల్యంగా ఉన్న వారుంటారు. వారు ప్రతిరోజూ రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. తరచుగా వీధుల్లో లేదా రైల్వే స్టేషన్ లేదా దేవాలయాల వద్ద తిండి కోసం అడుక్కునే వికలాంగులను చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కాసేపట్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌లో పునరాగమనం చేస్తున్నాడు.