భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే.. ఎమ్మెల్సీ కవిత పై కేసు పెట్టేదా? అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్పా.. బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు.
TS Transport: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్.. ఇకపై చర్యలు తప్పవు..
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయని పేర్కొన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని విమర్శించారు. తాము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమో అని అన్నారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే.. కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువని కేటీఆర్ తెలిపారు.
Mukesh Ambani: ‘ముఖేష్ కాకా’ అంటూ పిలిచిన వ్యక్తి.. ముఖేష్ అంబానీ రియాక్షన్ వైరల్..