ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా పెరిగిన పొట్ట తగ్గాలంటే ఈ పానీయాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి పొట్ట కొవ్వును తగ్గించి, పొట్ట స్లిమ్‌గా కనిపించేలా చేస్తుంది. ఇంతకీ ఆ పానీయాలు ఏమిటో.. వాటిని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.
Aakash Chopra: టీ20 వరల్డ్ కప్లో ఆ జోడి ఓపెనింగ్ చేయాలి..
నిమ్మరసం
నిమ్మరసాన్ని చక్కెర లేదా ఉప్పు కలిపిన నీటిలో త్రాగినా కొవ్వు కరిగిపోతుంది. లెమన్ వాటర్ ఒక క్యాలరీ ఫ్రీ డ్రింక్. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా.. జీవక్రియను పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ ‘సి’.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీలో తక్కువ కేలరీలు, కొవ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తాగడం వలన సన్నగా మారిపోతారు. ఇది తాగడం వలన జీవక్రియను పెంచి.. శరీరానికి శక్తిని అందిస్తుంది. కెఫీన్ తీసుకోవడం మానసిక చురుకుదనాన్ని పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ అనేది తక్కువ కేలరీల పానీయం. దీని ప్రభావం త్వరగా బరువు తగ్గడంలో, బొడ్డు చుట్టు ఉన్న కొవ్వును తగ్గించడంలో చూపిస్తుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగితే బరువులో మార్పు కనిపిస్తుంది. ఈ పానీయం తాగిన తర్వాత ఎక్కువగా నడవడం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. కానీ.. యాపిల్ సైడర్ వెనిగర్ ను మామూలుగా తాగొద్దు. దీనిని ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఆపిల్ వెనిగర్ ను కలపాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అధిక యాపిల్ సైడర్ వెనిగర్ హానికరం.. కాబట్టి దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.