భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై24క్యూ3) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన (YoY) 34 శాతం పెరుగుదలతో రూ.16,373 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. HDFC బ్యాంక్ నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. LSEG డేటా ప్రకారం.. విశ్లేషకులు నికర లాభం రూ.15,651 కోట్లుగా అంచనా వేశారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. ఇది తనపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలిపారు.
నేపాల్ లోని త్రిశూలి నదిలో మంగళవారం తెల్లవారుజామున బాగ్మతి ప్రావిన్స్‌లో భారతీయ నంబర్ ప్లేట్‌తో కూడిన జీపు నదిలో పడిపోయింది. దీంతో నేపాల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చిత్వాన్ జిల్లాలోని త్రిశూలి నదిలో సాయంత్రం 4.30 గంటల సమయంలో బొలెరో వాహనం పడిపోయిందని ముంగ్లింగ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోదాలు జరుగుతున్నాయని.. అంతేకాకుండా, ఎవరైనా గల్లంతయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నదిలో పడిపోయిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ 'BR 09 BC 1430'గా…
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్‌కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు చేశారు. సరయూ నది ఒడ్డున ఉన్న…
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు హర్యానాలో…
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా తనను విశ్వసించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా.. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.