చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు అని వేయిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.…
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. పలువురు తమ ప్రయాణాలు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. భారత్ పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికాయి. మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.
ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ క్రికెట్ అభిమానులతో సందడిగా…
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 801.67 పాయింట్లు కోల్పోయి 71,140కి పడిపోయింది. నిఫ్టీ 21550 పాయింట్లు పడిపోయి.. 215 పాయింట్లు కోల్పోయాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకోగా.. ఈరోజు అదే స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. ఉదయం గ్రీన్ మార్క్ తో ప్రారంభమైన మార్కెట్ ఎట్టకేలకు రెడ్ మార్క్ తో ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో మార్కెట్‌లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. నూజివీడు సీటు సారథికి వద్దు, గాడిదను అయినా గెలిపిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. సారథి వస్తే తరిమి కొడతాం అంటూ పోస్టింగ్ లు వెలిశాయి. ఇప్పటికే టీడీపీ నూజివీడు సీటు తనకు కన్ఫర్మ్ అయిందని.. స్థానిక టీడీపీ నేతలకు సారథి ఫోన్స్ చేయటంతో రచ్చ జరుగుతోంది. తాజాగా పోస్టింగ్ లతో సారథి వ్యవహారం రచ్చగా మారింది.
గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్…
ఫేక్ పోస్టింగులతో టీడీపీ తలపట్టుకుంటుంది. టీడీపీని.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ - జనసేన మధ్య గ్యాప్ పెంచేలా పోస్టింగులు ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. జనసేనకు 63 స్థానాలు ఇచ్చామంటూ ఇటీవలే అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ పోస్టింగులు చేశారు. అంతేకాకుండా.. పవన్ ను విమర్శిస్తున్నట్టు బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టారు. కాగా.. కేశినేని నానినే తనపై ఫేక్ పోస్టింగులు పెట్టారని బుద్దా భావిస్తున్నారు. ఈ క్రమంలో బుద్ధా స్ట్రాంగ్…