ఫేక్ పోస్టింగులతో టీడీపీ తలపట్టుకుంటుంది. టీడీపీని.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ పెంచేలా పోస్టింగులు ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. జనసేనకు 63 స్థానాలు ఇచ్చామంటూ ఇటీవలే అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ పోస్టింగులు చేశారు. అంతేకాకుండా.. పవన్ ను విమర్శిస్తున్నట్టు బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టారు. కాగా.. కేశినేని నానినే తనపై ఫేక్ పోస్టింగులు పెట్టారని బుద్దా భావిస్తున్నారు. ఈ క్రమంలో బుద్ధా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుజ్జీలు, నానీలు తననేం పీకలేరంటూ విమర్శలు గుప్పించారు. అచ్చెన్న, బుద్దాల పేర్లతో వచ్చిన ఫేక్ పోస్టింగులపై పోలీస్ స్టేషన్లల్లో టీడీపీ ఫిర్యాదులు చేసింది.
TDP: ఒంగోలుపై పట్టు సాధించేందుకు టీడీపీ కసరత్తు..
ఈ క్రమంలో.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ నగర పోలీసు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనపేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని.. జనసేన-టీడీపీ కలయికను జీర్ణించుకోలేని కొంతమంది ఈ తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని తెలిపారు. తమకు చంద్రబాబు ఎలాగో మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ కూడా అంతే సమానమన్నారు. దయచేసి ఈ తప్పుడు పోస్ట్ లు పెడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవల్సిందిగా కోరుచున్నట్లు బుద్ధా వెంకన్న ఫిర్యాదులో తెలిపారు.
Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్