Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డి కలయికలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘మా ఇంటి బంగారం. గత నెల 19న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వరల్డ్వైడ్గా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఇదే మొదటిసారి. అంతటి సెన్సేషన్ చేసి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ చిత్రాన్ని జియోహాట్స్టార్ ఓటీటీ సంస్థ సౌత్ ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మరియు మలయాళ భాషల్లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతూ పాన్ ఇండియా ప్రేక్షకులందరినీ అలరించేందుకు ఈ యాక్షన్ డ్రామా సిద్ధమైంది. వివాహం తర్వాత అత్తారింటికి వచ్చిన కోడలు తన గతాన్ని దాచిపెడుతూ, సాధారణ గృహిణిగా మెప్పించడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన గతం వల్ల ప్రస్తుత కుటుంబానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆమె ఎలా పోరాడింది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే ఆసక్తికరమైన కుటుంబ, యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సమంత తన అద్భుతమైన నటన, యాక్షన్ సీక్వెన్స్లతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించింది. ఈ వీకెండ్ కు ఫ్యామిలీతో సరదాగా చూసేయండి.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..