Parthasarathy: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. నూజివీడు సీటు సారథికి వద్దు, గాడిదను అయినా గెలిపిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. సారథి వస్తే తరిమి కొడతాం అంటూ పోస్టింగ్ లు వెలిశాయి. ఇప్పటికే టీడీపీ నూజివీడు సీటు తనకు కన్ఫర్మ్ అయిందని.. స్థానిక టీడీపీ నేతలకు సారథి ఫోన్స్ చేయటంతో రచ్చ జరుగుతోంది. తాజాగా పోస్టింగ్ లతో సారథి వ్యవహారం రచ్చగా మారింది.
Read Also: TS MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్
ఆ పోస్ట్ లలో పెనమలూరులో పోటీ చేస్తే ఓడిపోతావ్ వైసీపీ టికెట్ ఇవ్వలేను- పార్ధుతో జగన్ అన్న… పెనమలూరులో పోటీ చేస్తే ఓడిపోతావ్ టీడీపీ టికెట్ ఇవ్వలేను- పార్ధుతో చంద్రబాబు.. పెనమలూరులో ఏ పార్టీకి పనికిరాని పార్ధు,, పెనమలూరులో ఏ పార్టీ టికెట్ తెచ్చుకోలేని పార్ధు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
Read Also: Indigo Flight: నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య..